11, డిసెంబర్ 2012, మంగళవారం

మనం మానవులం...... ,! 
దయాహృదయులం.....,!!
ఆనందం గా బ్రతకడం మనకే కాదు  అన్ని జీవులకూ దేవుడిచ్చిన ఒక వరం.
మానవత్వం తో ఆలోచించండి .
పర్యావరణాన్ని కాపాడటానికి కొంచెమైనా ప్రయత్నించండి .
మనతో పాటు  అన్ని జీవులనూ బ్రతకనివ్వండి.
మన పర్యావరణాన్ని కాపాడటానికి మనం చేయవల్సిన కనీస బాధ్యతలు :
1) ప్లాస్టిక్  బ్యాగ్లను వాడడంతగ్గించండి . (ఎందుకంటే మన తరువాతి తరం జీవులకు ,కేవలం ప్లాస్టిక్ ని  మాత్రమే ఉంచారు, అవసరమైనవన్నీ వాడేసుకున్నారు అనే  ఒక ఆలోచనని కలగజేయడం న్యాయం కాదు .)
2) మిగిలిన జీవులకు మేలు చెయకపోఇనా పర్వాలేదు చెడు మాత్రం చేయకండి . (అన్ని జీవులు ,అన్ని జీవుల మనుగడకూ   అత్యవసరం . ఇది శాస్త్రీయంగా 'ఆహారపు గొలుసు' అనే ప్రక్రియలో వుండాలి )
3) వన్య జీవులను వేటాడటాన్ని వాటిని విద్యుత్ మొదలైన వాటితో సంహరించడాన్ని సమర్ధించకండి .
4) చమురు ఉత్పత్తులను పొదుపుగా వాడండి ,,జీవ ఇంధనాన్ని వాడటం చాలా మంచిది .
ఒక్కనిమిషం ఆలోచించండి ఆచరించడానికి ప్రయత్నం చేయండి.